ఉత్తమ్ ను కోరుకున్న హుజూర్ నగర్ ప్రజలు..

by Sumithra |
ఉత్తమ్ ను కోరుకున్న హుజూర్ నగర్ ప్రజలు..
X

దిశ, నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఆయన ముందు నుంచి ఆశించినట్లే 50,000 మెజార్టీకి ఎన్నికల్లో ఆయనకు పదేపదే అన్నట్టుగానే ఎన్నికల్లో ఆయన 44,888 మెజార్టీని సాధించారు. ఈ నియోజకవర్గంలో 308 బూతులలో 18 రౌండ్లుగా నిర్వహించారు. ప్రతి రౌండ్ లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మెజార్టీని సాధించారు. ఎన్నికల్లో ఉత్తమ్ కు పోలైన ఓట్లు 1,16,7707 రాగా ఆయన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 71,819 ఓట్లను సాధించారు.

ఉత్తమ్ గెలుపునకు కలిసి వచ్చిన అంశాలు..

ప్రభుత్వం పై వ్యతిరేకతతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తం కుమార్ రెడ్డి గెలిస్తే రాష్ట్రస్థాయిలో కీలకమైన పదవిలో ఉంటారని హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత ముందుంటుందని ఆశించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి వెంట ఉన్న ప్రధాన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉత్తమ్ కు ప్లస్ గా మారింది.

ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓటమికి కారణాలు..

ఎమ్మెల్యే సైదిరెడ్డి పై భూముల ఆక్రమణలు, ఇసుక దందా, మైనింగ్ దందా, మద్యం దందా లాంటి ఆరోపణలు వినిపించాయి. అలాగే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు కేవలం పార్టీ వారికే అందించారని పూర్తి వ్యతిరేకత చోటుచేసుకుంది. స్థానికంగా ఉండి ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు ఆయనను విస్మరించారు. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత ఆయన ఓటమికి కారణాలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed