- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క రోజులోనే మనసు మార్చుకున్న జేపీఎస్‌లు.. సంచలనంగా మారిన లేఖ!
దిశ, నల్లగొండ బ్యూరో: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్ల సాధనకు గత నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ప్రభుత్వం మాత్రం పంచాయతీ కార్యదర్శుల సమ్మె చట్ట విరుద్ధమని.. మే 9 తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వారంతా వీధుల్లో చేరాలని వరకు గడువు విధించింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మే 9వ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 171 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు.
ఇదిలా ఉండగా, నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల, పోల్కంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శులు తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్కార్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు శేఖర్, శ్రీశైలం మంగళవారం ఎంపీడీవోకి లేఖ ఇచ్చారు. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే వారు మనసు మార్చకున్నారు. తమ జాయినింగ్ లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం ఎంపీడీవోకి మరో లేఖ రాయడం సంచలనంగా మారింది. దీంతో వీరి బాటలో మరికొందరు పంచాయతీ కార్యదర్శులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.