మంత్రాల నెపంతో.. మహిళపై దాడి

by Naveena |
మంత్రాల నెపంతో.. మహిళపై దాడి
X

దిశ, నార్కట్ పల్లి : మంత్రాలు చేస్తుందనే అనుమానంతో మహిళపై దాడి చేసిన సంఘటన నార్కట్ పల్లి మండల పరిధిలోని అక్కెనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏనుగుతల ఝాన్సీ కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురవుతోంది. దీంతో అదే గ్రామానికి చెందిన బెక్కంటి పుల్లమ్మ మంత్రాలు చేయడం వల్లే అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని వారి కుటుంబ సభ్యులు అనుమానాలు పెంచుకున్నారు. ఎలాగైనా ఆమెని చంపితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఝాన్సీ భర్త ఏనుగుతల దయాకర్, మామ ఏనుగుతల నరసింహ, అత్త జయమ్మ, మరొక మామ మిడిదొడ్డి సత్తయ్యలు, ఈనెల 7వ తేదీన బాధితురాలు ఇంటికి వెళ్లి..ఎట్టి పరిస్థితుల్లో చంపుతామని బెదిరించారు. అదేవిధంగా 9వ తేదీన బెక్కంటి పుల్లమ్మ బయటకు వెళ్లి వస్తుండగా..ఏనుగు తల దయాకర్ ఆమెపై కత్తితో దాడి చేశారు. వెంటనే గమనించిన బాధితురాలు భర్త యాదయ్య రావడంతో..దయాకర్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. వెంటినే స్పందించిన పోలీసులు నిందితులను విచారించి..కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మూఢనమ్మకాలను ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై డి క్రాంతి కుమార్, రైటర్ రాము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed