- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి: ఎంపీపీ
దిశ, నాగారం : మండల అభివృద్ధి కొరకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేయాలని నాగారం ఎంపీపీ కూరం మణి వెంకన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులను గ్రామాలలోని సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు . ఫణిగిరి గ్రామ సర్పంచ్ గట్టు నరసింహారావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను వేల రూపాయలతో వాటిని నిర్మిస్తే వాటిని వినియోగం లోకి తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారని తక్షణమే వాటిని వినియోగంలోకి తేవాలని ఆయన కోరారు. శాంతినగర్ నాగుల్ మీరా సర్పంచ్ మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని అధికారులకు తెలిపారు. విద్యుత్ శాఖ సమస్యలపై వాడి వేడిగా చర్చ జరిగింది. ఉ
దాన్య శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి ప్రజలను సబ్సిడీలపై అవగాహన కల్పిస్తూ చైతన్యం చేయాలని కోరారు.ఎక్సైజ్ శాఖ అధికారులు రోడ్డు భవనాల శాఖ అధికారులు ఎమ్మెల్యే హాజరైతేనే వస్తారు తప్ప మిగతా సర్వసభ్య సమావేశానికి ఎందుకు రారు అని ప్రజా ప్రతినిధుల నుండి వాదనలు వినిపించాయి. ఈ రెండు శాఖల వారిని ఎంపీపీ ఎంపీడీవో పలుమార్లు హెచ్చరించిన పట్టించుకోకపోవడం,ఇరిగేషన్ శాఖ డి ఈ పిచ్చయ్య మాట్లాడుతూ అనుమతి లేకుండానే అక్రమ ఇసుక క్వారీ నిర్వహిస్తున్నందుకు నాకు ఎటువంటి సంబంధం లేకున్న ప్రభుత్వం జీతం ఆపేసిందని మనోవేదన వ్యక్తం చేశారు. ఈ క్వారికి నాగారం మండల పరిధిలో ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. అనంతరం 75 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి సైదులు , తాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ ,ఎంపీడీవో శోభారాణి, గ్రామ కార్యదర్శులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు