నల్లగొండ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే కంచర్ల vs పిల్లి రామరాజు యాదవ్

by Mahesh |
నల్లగొండ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే కంచర్ల vs  పిల్లి రామరాజు యాదవ్
X

నీలగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయం రంజుగా మారింది. రోజురోజుకు సరికొత్త పరిణామాలతో ఆ పార్టీ నేతల తీరు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి అనతికాలంలోనే వర్గపోరు తీవ్రమైందనే చెప్పాలి. ఇప్పటికే చకిలం శ్రీనివాసరావు ఎమ్మెల్యే కంచర్ల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గుత్తా అమిత్, చాడ కిషన్ రెడ్డి రూపంలోనూ కంచర్ల టికెట్‌కు ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. ఇది చాలదన్నట్టు మరో అదే పార్టీకి చెందిన బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్ నియోజకవర్గ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. టికెట్ ప్రస్తావన లేకుండానే నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు.

దీంతో ఎమ్మెల్యే కంచర్లను మించిన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా ఇటు పార్టీ కార్యక్రమాలు చేస్తూనే అటు ప్రజాసేవలోనూ చురుగ్గా పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాక నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ రైటింగ్స్, పోస్టర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదంతా తట్టుకోలేని ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పటికే పలుమార్లు రామరాజుయాదవ్‌కు చెందిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను చించివేశారు. దీనికితోడు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడి బాధ్యతల నుంచి రామరాజును ఎమ్మెల్యే తొలగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, రామరాజుకు మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. ఈ పరిణామాలను చూస్తుంటే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి తలనొప్పి తప్పదనే తెలుస్తోంది.

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయం రంజుగా మారింది. రోజురోజుకు సరికొత్త పరిణామాలతో బీఆర్ఎస్ నేతల తీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి అనతికాలంలోనే వర్గపోరు తీవ్రమైందనే చెప్పాలి. ఇప్పటికే చకిలం శ్రీనివాసరావు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గుత్తా అమిత్, చాడ కిషన్ రెడ్డి రూపంలోనూ కంచర్ల టికెట్‌కు ముప్పు పొంచి ఉంది. ఇది చాలదన్నట్టు మరో బీఆర్ఎస్ బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్ నియోజకవర్గ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. టికెట్ ప్రస్తావన లేకుండానే నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు.

కంచర్లను మించిన క్రేజ్..

మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్ ఇటు పార్టీ కార్యక్రమాలు చేస్తూనే అటు ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. రజక కుటుంబాలకు ఐరన్ బాక్సులు అందించడం, ఎస్ఐ, కానిస్టేబుల్స్ అభ్యర్థులకు షూస్ పంపిణీ చేయడం, పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మరణించిన పేద కుటుంబాలకు తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. దీనికితోడు నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ రైటింగ్స్, పోస్టర్లతో పిల్లి రామరాజు యాదవ్ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని కనుమరుగు చేస్తూ ప్రజల్లో పిల్లి రామరాజుయాదవ్ హాట్ టాపిక్‌గా నిలుస్తుండడం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది.

పోస్టర్లు, ఫ్లెక్సీల చించివేత..

పిల్లి రామరాజుయాదవ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. ఇదంతా తట్టుకోలేని ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పటికే పలుమార్లు రామరాజుయాదవ్‌కు చెందిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను చించివేశారు. దీనికితోడు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడి బాధ్యతల నుంచి రామరాజును ఎమ్మెల్యే తొలగించారు. అయితే ఇటీవల నియోజకవర్గంలో ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పిల్లి రామరాజులు వేర్వేరుగా ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు భారీగా వేశారు. దీంతో మున్సిపల్ అధికారులు ఉగాది పండుగ అయిపోయిందంటూ పిల్లి రామరాజుకు చెందిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను చించివేశారు. కానీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఫ్లెక్సీలను మాత్రం అలాగే ఉండటం గమనార్హం. గతంలో పిల్లి రామరాజుకు చెందిన వాల్ రైటింగ్‌పై తెల్ల సున్నం వేసిన సంగతి తెలిసిందే.

మద్దతు ఆ కీలక నేతదేనా..?

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పక్కకు నెట్టి పిల్లి రామరాజు యాదవ్ పలు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇదే విషయమై పలుమార్లు కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఓ వైపు పిల్లి రామరాజుకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే యువకులను అకారణంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు లేకపోలేదు. సీఎం కేసీఆర్ గతంలో నిర్వహించిన బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున జనాన్ని తరలించి రామరాజుయాదవ్ అందరి దృష్టిలో పడ్డారనే చెప్పాలి.

ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రామరాజును నియంత్రించ లేకపోవడం పెద్ద వైఫల్యమనే చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఇంతలా కార్యక్రమాలు చేస్తున్న మౌనం వహించడం తప్ప ఎమ్మెల్యే చేసేదేం లేకుండా పోయింది. అసలు పిల్లి రామరాజుయాదవ్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ కీలక నేత మద్దతు ఉండడం వల్లే ఈ స్థాయిలో రామరాజు హావా కొనసాగుతుందని రాజకీయ వర్గాల అభిప్రాయం. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిల్లి రామరాజు యాదవ్ కంచర్లకు చెక్ పెట్టి నల్లగొండ టికెట్ ఎగరేసుకుపోయేలా కన్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed