- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి.. MLA చిరుమర్తి లింగయ్య
దిశ, చిట్యాల: సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూర్, గుండ్రాంపల్లీ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్, దివిస్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతోందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలను సునీత వెంకటేష్, వైస్ ఎంపీపీ మర్ల అలివేలు, సర్పంచులు పాలెం మాధవి మల్లేష్, రత్నం పుష్ప నరసింహ తదితరులు పాల్గొన్నారు.