- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Former MLA Chirumurthy Lingaiah : ప్రభుత్వానిది పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ..
దిశ, నార్కట్ పల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువగా మారిపోయిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మాయ మాటలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. నార్కట్ పల్లి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణా నీటిని వృధా చేయకుండా ప్రతినీటి బొట్టుతో చెరువులను నింపాలని కోరారు. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ రిజర్వాయర్ను నింపడం ద్వారా దాదాపుగా 10 గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ పెరుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో ఉదయ సముద్రం ట్రయల్ రన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
ఇప్పటికీ ఆర్డీవో అకౌంట్లో 12 కోట్ల రూపాయలు ఉన్నాయని మరో 150 కోట్లు కేటాయించి ల్యాండ్ యాక్టివేషన్ చేసి అన్ని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నందున జిల్లాలోని 4వేల చెరువులను అదేవిధంగా నియోజకవర్గంలోని 350 చెరువులు కుంటలను పూర్తిగా నీటితో నింపాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఉదయ సముద్రాన్ని నాలుగు నెలల్లో పూర్తిచేస్తానని చెప్పడం ఆనందించే విషయమని అదే విధంగా దాన్ని పూర్తి చేయాలన్నారు. ఎస్ఎల్ బీసీకి 800 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టారని కానీ ఆ బడ్జెట్ పై ఎటువంటి వివరణ ఇవ్వలేదన్నారు. నాలుగైదు నెలల్లో ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తి చేసి ఇక్కడి రైతాంగానికి అండగా ఉండాలని కోమటిరెడ్డిని కోరారు. ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లా మంత్రి అయినందున జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గతంలోనే 19 వేల కోట్ల పైచిలుకు రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా చేశారని గుర్తు చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ అని డిప్యూటీ సీఎం చెప్పగా రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ అంటూ సీఎం చెప్పారని కానీ చివరికి డిప్యూటీ సీఎం మాటే నెగ్గిందన్నారు.
దీనిని బట్టి చూస్తే ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేశామని చెబుతున్నప్పటికీ నేటికీ 70% రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీతో ఆంక్షలు వల్ల రైతులు నష్టపోతున్నారని ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధు 15000, వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ అంశం పై భారీగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని హామీల అమలను మరిచారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరి శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ, యానాల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు దుబ్బాక శ్రీధర్, యూత్ నాయకులు నడింపల్లి నరేష్, జాల ప్రకాష్, సత్తిరెడ్డి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.