బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే బొల్లం

by Kalyani |   ( Updated:2023-01-17 13:57:31.0  )
బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే బొల్లం
X

దిశ, కోదాడ టౌన్: బుధవారం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను విజయవంతం చేద్దామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించిన టీ షర్ట్ ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి దేశానికి సందేశంగా ఈ బహిరంగ సభ ఉంటుందని, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అమలు చేయని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, కొండ సైదయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, హాల్తాఫ్ హుస్సేన్, వెంపటి మధుసూదన్, ఎలక నరేందర్ రెడ్డి, బట్టు శివాజీ నాయక్, ఒంటిపులి శ్రీనివాస్, సాదిక్, బత్తుల ఉపేందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed