- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
దిశ, మిర్యాలగూడ : ధాన్య విక్రయించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మిల్లర్లకు సూచించారు. మంగళవారం వేములపల్లి మండలం శెట్టి పాలెం సమీపంలోని మిల్లులలో ధాన్యం కొనుగోలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాలని, మద్దతు ధర కల్పించాలని కోరారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు అందుబాటులో ఉండి ధాన్యం దిగుమతి చేయించాలని అన్నారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్ లో పోలీసు కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును పరిశీలించారు. దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డిఎస్పి రాజశేఖర్ రాజు, సీఐలు వీరబాబు, నాగార్జున, కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, లోకేష్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.