- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BJP leaders : అధికారులను బదిలీ చేయొద్దని ప్రభుత్వ విప్ అడగడం విడ్డూరం..
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి దేవస్థాన దేవాలయ ఉద్యోగులను బదిలీ చేయొద్దనడం విడ్డూరంగా ఉందని యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గతంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న సమయంలో అవినీతి ఉద్యోగుల గురించి మాట్లాడి, ఇప్పుడు అధికారంలోకి రాగానే అవినీతి అధికారులను బదిలీ చేయవద్దని ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడడం విడ్డూరమన్నారు. ఆలయ ఉద్యోగుల పిల్లల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరు నెలలు వాయిదా వేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు.
ఆలయ నియోజకవర్గంలో ఎన్నోసమస్యలు ఉండగా కేవలం 20 మంది ఉద్యోగుల కొరకు అసెంబ్లీలో మాట్లాడడం స్ధానికులు, నిరుద్యోగుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ది ఏంటో అర్ధం అవుతుందని అన్నారు. కొండపైన ఈఈగా విధులు నిర్వహిస్తున్న రామారావు చదువుకున్న దానికి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉందని, జూనియర్ అసిస్టెంట్ గా నియామకం అయిన అనతి కాలంలోనే ఏఈ, డీఈ, ఈఈగా పదోన్నతి పొందుతూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఈ విషయం పై నేడు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, నాయకులు ఆకుల చంద్రమౌళి, బందారపు మల్లేష్, బోడ బుచ్చిబాబు, గుండ్లపల్లి మధు, మందోజు నరేష్, సుడుగు రాజిరెడ్డి, బెలిదె అశోక్, ఆలేటి కర్ణ, అజయ్, సురేష్, విజయ్, రాము, శివ, కర్రె శ్యామ్ పాల్గొన్నారు.