నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బాత్‌రూమ్‌లోనే మహిళా ప్రసవం

by Satheesh |   ( Updated:2023-03-29 16:44:41.0  )
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బాత్‌రూమ్‌లోనే మహిళా ప్రసవం
X

దిశ, నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ గర్భిణీ బాత్‌రూమ్‌లో ప్రసావించింది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రగూడెం గ్రామానికి చెందిన గర్బిణీ మూడు రోజుల క్రితం పురిటి నొప్పులతో నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. మూడు రోజుల నుంచి సరిగ్గా పట్టించుకోని డాక్టర్లు.. మొదటి కాన్పులో సాధారణ డెలివరీ అయ్యిందని.. రెండవ కాన్పు కూడా నార్మల్ డెలివరీ అవుతోందని చెప్పారు. డెలివరీకి ఇంక సమయం ఉందని తిరిగి ఇంటికి వెళ్లాలని వైద్యులు సూచించారు.

అయితే, డాక్టర్లు అలా చెప్పిన కొద్ది సేపటికే ఆ గర్బిణీ బాత్ రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బాబును వెంటనే ఐసీయూకి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనపై పలువురు వైద్యుల తీరుపై మండిపడుతున్నారు. యువతి తండ్రి దిశతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు గంటల నుండి తన కూతురు నొప్పులతో బాధపడుతున్న వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. దీంతో తీవ్రమైన నొప్పితో తన కూతురు బాత్ రూమ్ లోనే బాబుకు జన్మనిచ్చింది తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటనలు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తరుచూ చోటు చేసుకుంటున్నాయని.. ఇకనైనా అధికారులు దృష్టి పెట్టి సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story