MLA : హైడ్రా అనేది పెద్ద టాస్క్

by Kalyani |
MLA : హైడ్రా అనేది పెద్ద టాస్క్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా అనేది పెద్ద టాస్క్ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో గొప్ప పని ప్రారంభించారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైడ్రాతో కొంత మందికి నష్టం కలిగిన అది భావితరాలకు ఉపయోగపడేదన్నారు. వర్షాలు, వరదలు వచ్చి వేలాదిమంది ఇండ్లులోకి నీళ్లు వస్తున్నాయని, ఇండ్లు కొట్టుపోతున్నాయన్నారు. ఖమ్మం, విజయవాడలో కొట్టుకుపోయిన ఇండ్లను అందరు చూశామన్నారు. ఇండ్లు నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అదుకుంటుందన్నారు. హైడ్రా అనేది పెద్ద టాస్క్ అని, హైడ్రాకు అందరూ సహకరిస్తున్నారన్నారు. అధికారులు సహనంతో బాధితులను నచ్చచెప్పి అక్రమాలను తొలగించాలని కోరారు. భువనగిరి పెద్ద చెరువులో ఇంక్రెడిబుల్ ఇండియా వాళ్ళు చెరువు ఎఫ్టీఎల్ అడ్డుగా కట్టపోసి వెంచర్ లో రోడ్లు వేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed