- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Huzur Nagar : ‘హుజూర్ నగర్’ టికెట్ సైదిరెడ్డికే!
దిశ, నేరేడుచర్ల: త్వరలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే 51 మంది అభ్యర్థులతో కూడిన ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇందులో ఉమ్మడి నల్లగొండకు జిల్లాకు చెందిన పలువురి పేర్లు ఉండటం గమనార్హం. కాగా, ఈ నెల 20న సూర్యాపేటలో సీఎం కేసీఆర్ సభ ఉండగా, ఆ రోజు పలు సెగ్మెంట్ల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశమున్నది.
సైదిరెడ్డికి కలిసి వచ్చిన అంశాలు..
హుజూర్‌నగర్ టిక్కెట్ శానంపూడి సైదిరెడ్డికే కన్ఫామ్ చేసినట్లు తెలిసింది. సైదిరెడ్డికి సెగ్మెంట్ లో అందరితో కలిసి ఉంటారనే పేరుంది. ద్వితీయ శ్రేణి నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేశారని అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా రూ. వేల కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. స్థానికంగా ఉంటూ ప్రజలతో మమేకమవుతారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డికి సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. అలాగే పార్టీ పిలుపునిచ్చిన ప్రతి ప్రోగ్రాం ను సక్సెస్ చేస్తుండడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.
20న సూర్యాపేట సభలో ప్రకటించే అవకాశం
ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పలువురి పేర్లు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట నుంచి గుంత కండ్ల జగదీష్ రెడ్డి, హుజూర్‌నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, తుంగతుర్తి నుంచి గ్యాదరి కిషోర్ పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.