- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది
దిశ,కోదాడ(అనంతగిరి) : రైతు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి మోసాలకు తావు లేకుండా పని చేస్తాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు అన్నారు. తుఫాను కారణంగా తడిచిన పంటని ఎండపెట్టి నూరుపు వేయాలని, పండించిన ప్రతి గింజనీ, రంగుమారిన కూడ ప్రభుత్వం కొనగోలు చేస్తుందని,స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేసే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది రైతుల వద్ద ఉన్న ధాన్యం నుండి శాంపిల్ సేకరించి, తేమ శాతం,ఇతర నాణ్యత ప్రమాణాలు పరీక్షిస్తారని,రవాణా చార్జీలు,హమాలీ, గోనె సంచులకు నగదు చెల్లెంచేలా ఆన్‌లైన్ చేసి ట్రక్ షీట్ జారీ అయ్యేలా చేసి రైతుకు ఎఫ్‌టిఒ కాపీ అందిస్తారని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి,ముస్కు శ్రీనివాసరెడ్డి,బుర్ర పుల్లారెడ్డి,ముత్తినేని కోటేశ్వరరావు,బాబు నాయక్,డేగ కొండయ్య,ఈదుల కృష్ణయ్య,కీతా లక్ష్మీనారాయణ,బోడపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు