MLA : విద్యాభివృద్ధికి నా పూర్తి సహకారం అందిస్తా

by Kalyani |
MLA : విద్యాభివృద్ధికి నా పూర్తి సహకారం అందిస్తా
X

దిశ ,మోత్కూరు: విద్యతో వికాసంతో పాటు సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు ఉపాధి మార్గాన్ని ఎంచుకునే వీలుంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శుక్రవారం మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమైందని పదవతరగతి తో పాటు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కష్టపడి చదివిన విద్యార్థులు జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా అధిరోహించి తమ జీవితాలను చక్కబెట్టుకుంటారని అన్నారు. మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ప్రిన్సిపాల్, లెక్చరర్ల బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

కళాశాలలో నెలకొన్న సమస్యలను కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వచ్చే విద్యా సంవత్సరంలోగా తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే లెక్చరర్లకు సరైన ఫర్నిచర్ లేకపోవడంతో తన జీతం నుండి మన్నికైన కుర్చీలను అందిస్తానని సభాముఖంగా ఎమ్మెల్యే ప్రకటించారు. మోత్కూర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్ జి ప్రభ జస్టిస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత, లక్ష్మి నరసింహారెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మీ నరసింహ రెడ్డి, వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ ,పేలపూడి వెంకటేశ్వర్లు చౌదరి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed