సర్పంచ్​లకు నిధులు మంజూరు చేస్తా : ఎంపీ ఉత్తమ్​

by Sridhar Babu |   ( Updated:2023-01-22 12:45:21.0  )
సర్పంచ్​లకు నిధులు మంజూరు చేస్తా : ఎంపీ ఉత్తమ్​
X

దిశ, దేవరకొండ : తన నల్గొండ పార్లమెంటు నిధుల నుండి దేవరకొండ నియోజకవర్గ సర్పంచ్​లకు వివిధ పనులకు గాను నిధులు మంజూరు చేస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం దేవరకొండ నియోజకవర్గం లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు హైదరాబాద్​లో ఆయన నివాసంలో కలిసి తమ గోడును విన్నవించారు. దేవరకొండ నియోజకవర్గం లో కేవలం అధికార పార్టీకి చెందిన సర్పంచులకే గ్రామపంచాయతీ బిల్డింగులు, సీసీ రోడ్లకు సంబంధించిన పనులను ఇస్తున్నారని, తమను కూడా మీ నిధుల ద్వారా ఆదుకోవాలని కోరారు. అందుకు వెంటనే స్పందించిన ఎంపీ తన పార్లమెంటు నిధుల ద్వారా దేవరకొండ మండలం లో ఉన్న14 మంది సర్పంచ్ లు అందరికీ ఎస్టి కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడి భవనాలు, గ్రంథాలయ భవనాలు, డ్రైనేజీలు, వాటర్ ప్లాంట్స్, స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్​కు నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపీని శాలువాతో ఘనంగా సత్కరించి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి, నేనావత్ బుజ్జి కుమార్, నార్య నాయక్, కడారి అయ్యన్న, మూడవ నాగరాజు ,నేనావత్​ సుశీల లక్ష్మణ్, సరోజా జగన్ ,లక్ష్మణ్, సిత్య నాయక్, నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed