‘అర్హులకు అందని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు’

by samatah |
‘అర్హులకు అందని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు’
X

దిశ, నల్లగొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా పక్రియ పూర్తిగా అవకతవకలు జరిగాయని, లబ్ధిదారుల ఎంపిక లోపబోయిష్టంగా జరిగింది. నల్లగొండ ఎమ్మెల్యే, అధికారులు ఎంపిక విషయంలో పూర్తి వైఫల్యం చెందారని,నల్లగొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మధ్యన ఉన్న వైరాన్ని తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. ఒంటరి మహిళలకు ముందు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఈ విషయమై చొరవ తీసుకొని స్పందించి నిరుపేదలకు ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో మరో ఉద్యమం చేయడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది అని తెలిపారు.

డ్రా తీసిన విధానం, ఎంపిక విధానము మీద పూర్తి వవిచారణ జరపాలని కోరారు. అనర్హులకు ఇల్లు పంపిణీ చేసే కార్యక్రమంకు బీఆర్ఎస్ కొమ్ము కాస్తుంది అని తెలిపారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చకుండా పేద ప్రజలను మోసం చేస్తున్నారని,ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టియకుండా కాలయాపన చేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. అసలైన అర్హులకు అందేలా బీజేపీ నిరుపేదల పక్షాన నిలుస్తుంది అని తెలిపారు. అవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదకు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నూకల వెంకట్ నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు మోరిశెట్టి నాగేశ్వరావు అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్,పిన్నింటి నరేందర్ రెడ్డి చర్లపల్లి గణేష్,గాలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed