- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రక్త దానం మరొకరికి ప్రాణ దానం : జిల్లా కలెక్టర్

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఒక వ్యక్తి చేసే రక్తదానం మరో వ్యక్తికి ప్రాణదానం అవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోమంది ఆర్గాన్స్ ఇవ్వడానికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడంపై చాలామంది మరణించారని చెప్పారు. ఈ మధ్యకాలం చాలా మందిలో అవగాహన వచ్చి రక్తదానం చేయడానికి ఎంతోమంది ముందుకొస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రక్త దానం చేసే వారి ఎన్ని సార్లు రక్త దానం చేశారని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ప్రతిరోజు బిజీగా ఉన్నప్పటికీ డిసిహెచ్ఎస్ రాజారాం చొరవతో రక్తదానం చేస్తున్నారని, ప్రత్యేకంగా డాక్టర్లు డాక్టర్ల కుటుంబాలు, ఫారా మెడికల్ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది రక్త దానం చేయడం మంచి కార్యక్రమమన్నారు. రాజారామ్ మంచి అవకాశంగా తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం, రూపు రేఖలు మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని,దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో బ్లడ్ షార్టేజ్ ఉన్నందున త్వరలో పెద్ద ఎత్తున ఒక మెగా క్యాంప్ రక్తదానం శిబిరం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రాజారాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.