- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి
దిశ, కోదాడ టౌన్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కోదాడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆయన సోమవారం నడిగూడెం మండలంలోని తెల్లబల్లి, రత్నవరం, శ్రీరంగాపురం, చాకిరాల, రామాపురం, ఎక్లాస్ ఖాన్ పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, 24 గంటల విద్యుత్ తదితర వసతులు పొందాయంటే కారణం బీఆర్ఎస్ కృషే అన్నారు. గత దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పైరవీకారులు రాజ్యమేలారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న అయిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అవసరమున్న ప్రతి వ్యక్తీ తనను నేరుగా కలుసుకునేలా వెసులుబాటు కల్పించానని ఎమ్మెల్యే అన్నారు.
సంక్షేమ పథకాలు నిరంతరంగా అమలవుతాయని, అందరి సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. కారు గుర్తుకే ఓటేసి స్థానికుడినైన తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో ఆయనకు ప్రతి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది. మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, ఎంపీపీ జ్యోతి మధుబాబు, రైతు సమితి అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, నాయకులు సురేష్ ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, పాలడుగు ప్రసాద్, బడేటి చంద్రయ్య, పుట్టా రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.