- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Nenawat Balu Naik : నా జీవితం ప్రజాసేవకే అంకితం..
దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అర్హులైన 57 మంది లబ్ధిదారులకు 16 లక్షల విలువ గల CMRF చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేని పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావాత్ బాలు నాయక్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ చికిత్సలు ఉచితంగా అందించేందుకు హెల్త్‌కార్డులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని అన్నారు.
త్వరలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లు వేసిన కార్యకర్తలకి వెయ్యను కార్యకర్తలకి అందర్నీ సమానంగా చూస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వెమన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేనుదర్ రెడ్డి, దూదిపాల శ్రీదర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సీనియర్ నాయకులు నాయిని మాధవ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపి వేంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ సలహాదారు పసునూరి యుగంధర్ రెడ్డి, మాజి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, మాజి ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు మంగ్య నాయక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.