- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ : ఎమ్మెల్యే బొల్లం
దిశ, కోదాడ టౌన్ : ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా ఇంచార్జి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అమరవీరులకు సంతాపాన్ని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలోఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరెన్ని మాట్లాడినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. అందరం కూడగట్టుకొని రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలని అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి కనిపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి మోసపు మాటలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలన్నారు. ఇటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు.
చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి, ప్రజా క్షేత్రంలో అంతా సమైక్యంగా పని చేయాలని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ప్రజా క్షేత్రంలోనే ఆ రెండు పార్టీలను ఎండగట్టాలన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఎలా వుంది. అంతకు ముందు ఎలా వుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్లీనరీలో చేసే తీర్మానాల పై గ్రామాల్లో చర్చ జరగాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో తేడాపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలని అన్నారు. గులాబీ సైనికులంతా ఒకే కుటుంబం అని తెలిపారు. మనమంతా కలిసిమెలసి ఉందాం అని ఆయన అన్నారు.
అయితే గత కొంత కాలంగా కోదాడ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నప్పటికీ అసమ్మతి నేతలు ఎక్కడా ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొనకపోవడం, మరోపక్క అసమ్మతి నేతలంతా జిల్లా కేంద్రంలో గుట్టుగా సమావేశాలు నిర్వహించటం, నిన్న మొన్నటి వరకు పోటాపోటీగా ఇఫ్తార్ విందులు నిర్వహించటం, జిల్లా ఇంచార్జ్ కూడా ఎమ్మెల్యే, అసమ్మతి నేతలను సమన్వయం చెయ్యడంలో అంతగా దృష్టి సారించకపోవడంతో వచ్చే ఎన్నికలలో పరిస్తితులు ఎటు వైపు దారితీస్తాయో అని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.