- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తాంః మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, నడిగూడెం : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు, మూడు రోజుల కురిసిన భారీ వర్షాల తాకిడికి నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రాపురం గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడి వందల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. కాగా సోమవారం ఉదయం గండి పడ్డ ప్రదేశాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గండి పడటానికి గల కారణాలను, పంట నష్ట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అతి భారీ వర్షాలల్లో కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాల్లోనే కురిసాయని తెలిపారు. అందులో భాగంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీటి ప్రవాహం పెరగడం, పాలేరు రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ రావటం మూలంగానే కాలువలో నీటి ఉధృతి పెరిగి కట్ట పై నుంచి నీరు ప్రవహించడం వల్ల కట్ట మెత్తపడి కోతకు గురై గండి పడిందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపధ్యంలో రెండు రోజుల్లో నీటి సరఫరా నిలిపిన వెంటనే పునరుద్ధరణ పనులను చేపడతాం. అధికారుల అంచనా మేరకు కట్టను వారం రోజుల్లో పునరుద్ధరించి నీటి సరఫరా యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పిస్తామన్నారు. అదే విధంగా నీటి మునిగి నష్టపోయిన పంట పొలాల వివరాలను అధికారుల ద్వారా సేకరించి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పంట నష్ట పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమికంగా 300 ఎకరాల మేరకు పంట నష్టం జరిగిందని అధికారుల అంచనా వేశారని, మరల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయి నష్టాన్ని లెక్కిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు, డీఈఈ రామకృష్ణ, రఘు, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీ ఎస్పీ, స్థానిక తహసీల్దార్ వసిమళ్ల సరిత, ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, ఎంపీఓ విజయ కుమారి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సైలు అజయ్ కుమార్, యాదవేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ బూత్కూరి వెంకటరెడ్డి, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.