ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి

by Naresh |
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
X

దిశ, నల్గొండ: 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో గ్రూప్ -1, బ్యాంకింగ్, అర్ అర్ బీ, ఎస్‌ఎస్‌సీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలచే భర్తీ చేయబడే ఇతర ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.

స్టడీ సర్కిల్ వెబ్సైట్ http://tsstudycircle.co.in/ నందు డౌన్ లోడ్ చేసుకోవాలని, పరీక్ష హాల్ టికెట్లు ఈ నెల 7 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పోటీ పరీక్షలు మార్చి 10, 2024న ఉదయం 11.00 గంటలు నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఉంటుందని, పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు బ్లాక్ బాల్ పెన్ను తీసుకురావాలని,సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచీలు అనుమతించబడవని తెలిపారు. పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య హై స్కూల్ దేవరకొండ రోడ్డు సాగర్ x రోడ్ నల్గొండలో ఉంటుందని, పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అర్ధగంట ముందు చేరుకోవాలని ,11 గంటల దాటితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇతర వివరాల కొరకు 8465035932, 9603167257 లేదా 9010895239 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed