విద్యుదాఘాతంతో గేదెలు మృతి

by Shiva |
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
X

దిశ, కోదాడ: విద్యుదాఘాతంతో మూడు గేదెలు, ఒక దూడ మరణించిన ఘటన అనంతగిరి మండలం వసంతాపురం ఆవాస గ్రామమైన తెల్లబండతండాలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో మేత మేస్తుండగా గత రాత్రి వచ్చిన గాలివానకు విద్యుత్ వైర్లు తెగి కిందపడి ఉన్నాయి. సంబంధిత అధికారులు విద్యుత్ తీగలను గమనించకుండా వదలేయడంతో ధరావత్ కోక్య కు చెందిన రెండు గేదేలు ఒక దూడ, భూక్య రామకు చెందిన ఒక గేదె విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా బాధితులు తెలిపారు. చనిపోయిన గేదెల విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని, పాడి సంపదే ఆదారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed