నాలుగు నెలల్లో పోడు రైతులకు పట్టాలి ఇప్పిస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి

by Vinod kumar |   ( Updated:2023-11-21 15:06:58.0  )
నాలుగు నెలల్లో పోడు రైతులకు పట్టాలి ఇప్పిస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
X

దిశ, నేరేడుచర్ల/పాలకవీడు: పాలకవీడు మండలంలో ఉన్న ప్రతి ఎకరానికి నీరు అందించాలని ఉద్దేశంతో 179 కోట్లతో కృష్ణా నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేసి మూడు పాయింట్లు ద్వారా ఈ ప్రాంతం రైతుల భూములకు అందిస్తామని హుజూర్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం పాలకవీడు మఠంపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శూన్య పహాడ్ ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని, కానీ మనం వేసే ఓటు మనకు ఉపయోగపడాలని.. ఎవరికి ఓటు వేస్తే పని చేస్తారో గుర్తించాలని.. ఎవరు వచ్చాక ఈ శూన్య పహాడ్ అభివృద్ధి జరిగిందో ప్రజల ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు వేయించుకుంటారే తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు. 4.5 కోట్లతో శూన్య పహాడ్ చెక్ డాం ను ఏర్పాటు చేశామని అన్నారు.

శూన్య పహాడ్ నుండి పెట్టి తండ వరకు బీటీ రోడ్డు వేస్తామన్నారు. స్థానిక పరిశ్రమంలో ఉద్యోగాల కోసం యువతకు స్కిల్ డెవలప్మెంట్ స్కీం ద్వారా యువతకు ఉద్యోగ కల్పన అవకాశాలను కల్పించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే జాన్ పహాడ్ దర్గా అభివృద్ధి కోసం 50 లక్షల నిధులు మంజూరు చేయించామన్నారు. అతి త్వరలో జాన్ పహాడ్ దర్గాను వికారాబాద్ దర్గా ఏ విధంగా మోడల్ దర్గా తీర్చిదిద్దారో అదే విధంగా జాన్ పహాడ్ దర్గాను 100 కోట్లతో అభివృద్ధి చేసే విధంగా తన వంతు కృషి చేస్తామన్నారు. మహంకాళి గూడాన్ని టూరిస్ట్ ప్లేసుగా అభివృద్ధి చేస్తామన్నారు.

నియోజకవర్గంలో 50 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి.. వాటి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల నమ్మరని ఆయనకు ప్రజలు ఓట్లువేయరని గుర్తించి కారును పోలిన దొంగ గుర్తులు తెచ్చారన్నారు. ఈ ప్రచారంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ రమణ నాయక్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిన్నా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాసోజు శంకరమ్మ, మండల పార్టీ అధ్యక్షులు క్రిష్టిపాటి, అంజిరెడ్డి, అప్పిరెడ్డి, మలమంటి దర్గారావు, ఎర్రెడ్ల సత్యనారాయణ రెడ్డి, దేవిరెడ్డి, వెంకటరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed