భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి : ఎమ్మెల్యే

by Disha Web Desk 11 |
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి : ఎమ్మెల్యే
X

దిశ, యాదగిరిగుట్ట : భువనగిరి పార్లమెంట్ పరిధిలోని యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో ప్రీమియర్ ఎక్సప్లొజివ్స్ లిమిటెడ్ కంపెనీలో పని చేసే ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి చామాల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలతోపాటు, కార్మికులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ప్రీమియర్ ఎక్సప్లొజివ్స్ కంపెనీ లో పనిచేసే కార్మికులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పథకాలను అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపిటిసిలు జిల్లా ఉపాధ్యక్షులు ఆరే ప్రశాంత్ గౌడ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Next Story