సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం..

by Sumithra |
సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం..
X

దిశ, సూర్యా పేట ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే సూర్యాపేటలోని ఓ ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి శనివారం రాత్రి ప్రవేశించిందని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.

స్థానికంగా నివాసం ఉంటున్న పిన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎలుగు బంటి ప్రవేశించిందని దాంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురై కేకలు వేయడంతో వెంటనే ఎలుగు బంటి ఆ ప్రాంతం నుండి పక్కనే ఉన్న గుండగని రాములు ఇంట్లోకి ప్రవేశించిందని తెలిపారు. అక్కడి ప్రజలు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకున్నే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

Advertisement
Next Story

Most Viewed