- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
old collectorate : సూర్యాపేట పాత కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఫైల్స్ దర్శనం..
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ఫొటోలో ఉన్నవి చిత్తు కాగితాలు కాదు.. ప్రభుత్వ శాఖలోని ముఖ్యమైన ఫైల్స్.. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఫైల్స్.. ఎంతో మంది ఉపాధి కొరకు పెట్టుకున్న అప్లికేషన్లు.. వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఆఫీసర్లు ఇలా గాలికొదిలేశారు. ఇది సూర్యాపేట జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖలోని అధికారుల నిర్వాకం. గతేడాది కొత్తగా కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేసుకుని పాత కలెక్టరేట్ నుండి నూతన కలెక్టరేట్ కు షిఫ్ట్ చేశారు.
అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ భద్రంగా కొత్త కలెక్టరేట్ కు తరలించారు. కానీ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మాత్రం పాత కలెక్టరేట్ లోనే చెత్తకుప్పలో పడేశారు. ఫైల్స్ లను డిజిటలైజేషన్ చేశాక భద్రపరచాల్సి ఉండగా ఇలా నిర్లక్ష్యంగా అక్కడే వదిలేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించిన అప్లికేషన్లు, విద్యార్థుల ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ అప్లికేషన్లు, ఆఫీసులకు సంబంధించిన కీలక పత్రాలు ఇలా నిర్లక్ష్యంగా పడేశారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన పత్రాలు ఇలా పాత కలెక్టరేట్లోనే వదిలేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని పై బీసీ సంక్షేమ శాఖ అధికారిణి అనసూర్యను వివరణ కోరగా షిఫ్ట్ చేసే సమయంలో లీవ్ లో ఉన్నానని సమాధానం చెప్పారు.