డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ; కలెక్టర్

by Kalyani |
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ల పరీక్షకు ఏర్పాట్లు  పూర్తి ;  కలెక్టర్
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : రేపు జిల్లాలో నిర్వహించే డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కోదాడలో రెండు, సూర్యాపేటలో 01 సెంటర్ నందు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12.30వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులు ఉదయం 8.30గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

అభ్యర్థులు పరీక్షకు వచ్చే ముందు కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న మాక్ టెస్ట్ లింక్ https://www.digialm.com:443/OnlineAssessment/index.html?1222142ని ఉపయోగించి ప్రాక్టీస్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి క్యాలికాలేటర్లు, సెల్ ఫోన్లు, వాచ్ లు, గాడ్జెట్, లను అనుమతి లేదని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని బూట్లు అనుమతి లేదని పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా చెక్ ఇన్ చేస్తుండడం వలన అభ్యర్థులు తమ చేతుల పై మెహందీ, ఇంక్, టాటూలు వేసుకోవద్దని సూచించారు.

Next Story