- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వన్ టౌన్ స్టేషన్ లో వార్షిక తనిఖీలు
దిశ ,మిర్యాలగూడ: మిర్యాలగూడలో వార్షిక తనిఖీలలో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ రాజశేఖర్ రాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్లను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పోలీస్ కిట్టులు, కేసు రికార్డులను పరిశీలన, కేసుల పరిష్కారంలో వన్ టౌన్ స్టేషన్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని కొనియాడారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పువని హెచ్చరించారు. డీజే ఏర్పాట్లకు ఎలాంటి అనుమతులు లేవని వేడుకలలో భాగంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 31న తనిఖీలు చేపడుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, మిగతా అన్ని షాపుల మూసివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, నాగార్జున, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.