ఆగ్రోస్ పెట్రోల్ బంకులో విద్యుత్ షాక్‌‌తో మేనేజర్ మృతి

by Aamani |
ఆగ్రోస్ పెట్రోల్ బంకులో విద్యుత్ షాక్‌‌తో మేనేజర్ మృతి
X

దిశ, నల్లగొండ: నల్లగొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వీటి కాలనీలో హెచ్ పీ పెట్రోల్ బంక్ఏర్పాటు చేశారు.అందులో మేనేజర్ గా నల్లగంతుల శ్రీకాంత్ పనిచేస్తున్నాడు.రోజు ఉదయం పెట్రోల్ స్టాక్ ట్యాంకర్ లో చూసే విధంగా చూద్దాం అని ఇనుప రాడ్డు పట్టుకొని చెక్ చేసే సమయంలో వెనకాల ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు అక్కడి బంకు లోని సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story