రన్నింగ్ రైలులోనే ప్రసవించిన మహిళ

by Mahesh |
రన్నింగ్ రైలులోనే ప్రసవించిన మహిళ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఓ మహిళ ప్రసవించి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్ పుర నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న రైలులో బీహార్‌కి చెందిన హీనా కాతూన్ కి పురిటినొప్పులు వచ్చాయి. భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఆ మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.‌ దీంతో రైలులోనే మహిళ ప్రసవించి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే తల్లి బిడ్డలను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed