- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కొరకు మంత్రికి వినతి
దిశ, మిర్యాలగూడ: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి జగదీశ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఆసుపత్రి ప్రారంభానికి హాజరైన మంత్రికి జర్నలిస్ట్‌లు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మీడియా రంగంలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజా సేవలో నిమగ్నమవుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు మిర్యాలగూడలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఖాజా హామిదొద్దీన్, జిల్లా అధ్యక్షులు ఎస్కే ఆయూబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. వెంకన్న, నియోజకవర్గ అధ్యక్షుడు మంద సైదులు, మహేష్, నజీమ్, రామకృష్ణ, నాగరాజు, హరీష్, యాదగిరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.