- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
దిశ,శాలిగౌరారం : సమగ్ర కుటుంబ ఇంటిటి సర్వే లో ఎలాంటి తప్పులు లేకుండా,పటిష్టంగా నిర్వహించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల లోని పెర్క కొండారం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సూపర్వైజర్లకు సూచనలు సలహాలు అందజేశారు. ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ ప్రతిరోజు 10 ఇండ్లను సర్వే చేయాలని,చేసిన సమాచారాన్ని సూపర్వైజర్ కు అందజేయాలని సూచించారు. సూపర్వైజర్లు సంబంధిత ఎమ్మార్వో కార్యాలయం,సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని,తదుపరి ఎన్యూమరేటర్లు రీ వెరిఫై చేసిన తర్వాత ఆ సమాచారాన్ని కంప్యూటర్ లో సబ్మిట్ చేయాలని అన్నారు. సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాకుండా గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. మండల వ్యాప్తంగా 24 గ్రామపంచాయతీలలో 14471 నివాస గృహాలు,107 ఎన్యూమరేటర్ బ్లాకులు,99 ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లు10 మంది,సర్వేలో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మాన్యా నాయక్,తాహశీల్దార్ పి యాదగిరి,ఎంపీడీవో జ్యోతి లక్ష్మి,సమరం రెడ్డి, గూని వెంకటయ్య, చింత ధనుంజయ్య,వేముల గోపి నాథ్,బోడ అరుణ్ కుమార్,యుగంధర్ రెడ్డి,భూపతి వెంకన్న,పాకాల సతీష్,పల్స సైదులు,తోటకూరి పరశురాం,నూక కిషోర్,సమగ్ర సర్వే సూపర్ వైజర్ లు,ఎన్యూమరేటర్లు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.