"బీటీ రోడ్ల నిర్మాణానికి 105. 12 కోట్లు మంజూరు"

by Mahesh |   ( Updated:2022-12-13 05:31:37.0  )
బీటీ రోడ్ల నిర్మాణానికి 105. 12 కోట్లు మంజూరు
X

దిశ, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కలిపి వివిధ శాఖల నుండి బీటీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని టీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ, 105 .12 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు (రెన్యువల్) 45 .59 ఆర్ అండ్ బి రోడ్లకు 29 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లకు 30 ,53 కోట్లు అలాగే కొండమల్లేపల్లి నుండి పాల్వాయి రోడ్డుకు 9 కోట్లు, చింతపల్లి మండలం నేల్వలపల్లి, తిరుమలాపురం, వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 4 కోట్లు నిధులు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. వీటికి సంబంధించి సంబంధించి ఇప్పటికే 10 కోట్ల రూపాయలకు టెండరు పూర్తయినట్లు తెలిపారు. మిగతా పనులకు టెండర్ పూర్తికాగానే త్వరలో పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

ముఖ్యంగా మారుమూల ప్రాంతాలైన చందంపేట, పీఏ పల్లి, మండలాలలో గతంలో వేసిన రోడ్లు అన్ని ప్రమాదాలకు గురై.. కంకర తేలడంతో వాటికి పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ద్వారా అధిక నిధులు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని సెకండ్ ఫేస్‌లో మిగతా గ్రామాలకు కూడా అధిక నిధులు రానున్నాయని ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. అలాగే దేవరకొండ మున్సిపల్ పరిధిలోని 14 కోట్ల రూపాయలతో మీనాక్షి ఎక్స్ రోడ్ నుండి మైనంపల్లి వరకు సెంట్రల్ లైటింగ్‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, జడ్పిటిసి మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు సిరం దాస్ కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టి వి ఎన్ రెడ్డి, రాజినేని వెంకటేశ్వరరావు, ముత్యాల సర్వయ్య, హనుమంతు వెంకటేష్ గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, చింతలపూడి ఇందిర, భాస్కర్ రెడ్డి, రహత్ అలీ, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Read More....

యాదవ కార్పొరేషన్ సాధించే వరకూ పోరాటం ఆగదు..

Advertisement

Next Story

Most Viewed