- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజల్ట్స్‌కు ముందే పరస్పర దాడులు.. మంచిర్యాలలో హైటెన్షన్..!
దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల నియోజకవర్గ బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రిజల్ట్స్‌కు ముందు వ్యవహరిస్తున్న తీరు ఇపుడు చర్చ నీయాంశంగా మారింది. గెలిచేందుకు సిద్ధం గా ఉన్నామని కొందరు, ఓటమి భయంతో ఏం తోచక మరి కొందరు ఎవరికి వారే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
పాత మంచిర్యాలలో అసెంబ్లీ ఎలక్షన్స్ రోజు పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు పోలింగ్ బూత్‌కు వెళ్ళే సమయం లో అతని వాహనాన్ని అడ్డు కున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఇద్దరు పరస్పర దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు పార్టీల నాయకులను చెదర గొట్టారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావును పోలింగ్ కేంద్రానికి రాకుండా అడ్డు కున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
నిన్న కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ ఎస్ నాయకులకు ఫోన్లు చేసి బెదిరించిన ఆడియోలు కొన్ని బయటకు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పోస్ట్‌ల గురించి ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. మాట్లాడుకునే క్రమం లో కొందరు కాంగ్రెస్ నాయకులు సహనాన్ని కోల్పోయి మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత భర్త శ్రీరాముల మల్లేష్ పై దాడికి పాల్పడ్డారు.
పలు సార్లు ఫోన్లు చేసి మా నాయకుడు గెలుస్తున్నాడు ఇష్టం వచ్చినట్లు ఇన్ని రోజులు మాట్లాడినారు కదా మీరు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించారని.. అదే క్రమం లో మాట మాట పెరగడంతో కొందరు కాంగ్రెస్ నాయకులు మల్లేష్ ఇంటి వద్దకు వచ్చి ఇంట్లో ఉన్న అతనిపై దాడి చేశారన్నారు. అడ్డు వచ్చిన మహిళలపై కూడా దాడి చేశారని బాధితుడు మల్లేష్ తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాక ముందే కాంగ్రెస్ నాయకులు గెలిచామనే ఊహగానాలతో ఇలా బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేయడం సబబు కాదని స్థానిక ప్రజలు చర్చించుకున్నారు.
నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
మున్సిపల్ కౌన్సిలర్ శ్రీరాముల సుజాత భర్తపై దాడికి నిరసనగా మంచిర్యాల లోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై బైఠాయించి కొందరు నాయకులు నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ఇతర బీఆర్ఎస్ నాయకులకు రక్షణ కల్పించాలని కోరారు. దాడికి పాల్పడినందుకు గాను కాంగ్రెస్ నాయకులు వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతూ దాదాపు గంట సేపు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై బీఆర్‌ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
బస్‌లో వెళ్తున్న మహిళలు దిగి వచ్చి పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకులతో వాగ్వాదం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి దిగి వచ్చారు. అంతటితో ట్రాఫిక్ సమస్య సద్దు మణిగింది. నిన్నటి వరకు ఇంటి ఇంటికి తిరిగి ఓట్లు అడిగిన నాయకులే ఇలా ఘర్షణకు దిగడం, రోడ్డుపై బైఠాయించి సాధారణ ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో నడిపెల్లి విజిత్ రావు, కౌన్సిలర్లు అంకం నరేష్, సుధమల్ల హరికృష్ణ, పోరెడ్డి రాజు, యూత్ నాయకులు గడప రాకేష్, బింగి ప్రవీణ్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.