మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం: MP సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం: MP సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మత మార్పిడులపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆడపిల్లలను మతమార్పిడి చేస్తున్నారని పద్దతి మార్చుకోకుంటే బుల్లెట్లు దించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఆదివాసి మహిళలను బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఆదివాసీలకు జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్‌ను నీళ్లలో కలిపి ఇస్తూ దేవుడి పేరుతో అమాయక ఆదివాసి బిడ్డలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమాయకులను మతమార్పిడి చేస్తున్నారని ఇది పద్దతి కాదన్నారు. తీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో మత మార్పిడికి పాల్పడుతున్న వారికి బుల్లెట్లు దింపే పరిస్థితి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని ఓ పార్లమెంట్ సభ్యుడిగా హెచ్చరిస్తున్నానన్నారు.

Advertisement

Next Story