- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanjay Raut on CM KCR : డ్రామాలు చేస్తే ఉన్నది కూడా పోతుంది: కేసీఆర్‌కు ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఉండబోదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఓటమి భయంతోనే మహారాష్ట్రకి వచ్చారని అన్నారు. కేసీఆర్ ఇలా డ్రామా చేస్తే తెలంగాణ కూడా దక్కకుండా పోతుందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని అన్నారు.
ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు అని, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) బలంగా ఉందన్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మహారాష్ట్రలో ప్రతీకారం తీర్చుకుందామని భావిస్తే.. కేసీఆర్ బీజేపీకి పని చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్ బీజేపీ ‘బీ టీం’ అని బీజేపీనే కేసీఆర్‌ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని విమర్శించారు.
Read more: మొదటిసారి పేరు వెనుక ‘రెడ్డి’ అని పెట్టుకున్న షర్మిల.. అందుకే సంకేతమా