- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్‌గాంధీ పై అనర్హత వేటు వేయడం బీజేపీ పిరికితనానికి నిదర్శనమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసే నిర్ణయం తీసుకోవడం కంట తడి పెట్టించేలా ఉన్నదన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్‌గాంధీ దాన్ని వదులుకున్నారని, పదవుల కోసం ఏనాడూ ఆరాటపడలేదన్నారు.
గాంధీభవన్‌లో దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్‌పై తీసుకున్న చర్యలకు దీటైన జవాబుగా కాంగ్రెస్ ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామా చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్‌పై వేటు వేసిన తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినా దానిపై స్పష్టమైన నిర్ణయం జరగలేదు. దీన్ని ఎంపీ కోమటిరెడ్డి ప్రస్తావిస్తూ, సామూహికంగా కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామా చేయడం ద్వారా ఒత్తిడి పెంచవచ్చని వ్యాఖ్యానించారు.
అదానీ గురించి రాహుల్ లోక్‌సభ వేదికగా మాట్లాడిన తర్వాత నుంచే ఆయనపై చర్యలకు కుట్ర జరిగిందన్నారు. రాహుల్‌గాంధీని ఇలాగే వదిలేస్తే పార్లమెంటులో అదానీ గురించి ఇకపైన కూడా మాట్లాడతారేమో అనే నయం బీజేపీని వెంటాడుతున్నదని, దాన్నుంచి తప్పించుకోడానికే అనర్హత వేటు నిర్ణయం అని అన్నారు.
ఒక పథకం ప్రకారమే 2019లో కర్నాటకలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం కేసు విచారణ ప్రక్రియను సూరత్ కోర్టు ద్వారా పూర్తి చేయించి శిక్ష పడేలా బీజేపీ పావులు కదిపిందన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఇంధిరాగాంధీపై వేటు వేసినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు.