- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆరెంజ్ బుక్‌లో అన్నీ రాసుకుంటున్నాం.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు MP ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: అధికారులకు బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు. బాస్‌ల ఆదేశాలు కాదు.. నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు. లేదంటే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా ఆరెంజ్ బుక్(Orange Book) మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఆ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నాం.. సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయటపెడతాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అన్నారు. కళ్లు మూసుకొని పిల్లి పాలు తాగినట్లుగా అధికారులు పనిచేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోము అని సీరియస్ అయ్యారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని అన్నారు. పార్లమెంట్ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు మూడింతలు అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు.