Eatala: అక్కడ నెల్సన్ మండేలా.. ఇక్కడ మందకృష్ణ: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Eatala: అక్కడ నెల్సన్ మండేలా.. ఇక్కడ మందకృష్ణ: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గురువారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగని ఈటల రాజేందర్ (Eatala Rajendar) కలిశారు. మందకృష్ణ మాదిగ లక్ష డప్పుల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణకు ఈటల శాలువ కప్పి సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెట్టే ప్రజలకు అండగా ఉన్న జాతి.. తన శక్తినంతా ధారపోసిన జాతి.. సంపద సృష్టించి అన్నిటికీ దూరమైన జాతి.. అణచివేతకు గురైన జాతి మాదిగ జాతి అని పేర్కొన్నారు. ఆ జాతిని పైకి తీసుకురావాలని కృతనిశ్చయంతో.. నమ్ముకున్న జాతిని, నమ్ముకున్న ఆశయాన్ని గమ్యాన్ని ముద్దాడే ముద్దాడే వరకు.. ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెరవని వ్యక్తి మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అని కొనియాడారు. ఆ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారని, భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకోవడం సంతోషమన్నారు. జాతి కోసం సుదీర్ఘంగా నెల్సన్ మండేలా కొట్లాడారని, ఇక్కడ మందకృష్ణ అణగారిన బిడ్డల గొంతుకయ్యారని, జాతి గౌరవం నిలబెట్టారని, ఆయన జాతికే గర్వకారణమని కొనియాడారు.

రూ.5 వేల కోట్లు రిలీజ్ చేసి రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పెండింగ్‌ఫీజు బకాయిలు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ ఈటల మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 14 లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్నారని వెల్లడించారు. రూ. 5 వేల కోట్లు రిలీజ్ చేసి (Reimbursement) ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ ముందుంటుందని భరోసా ఇచ్చారు.


Next Story

Most Viewed