MP Chamala: బన్నీపై పవన్ కళ్యాణ్ వాస్తవం మాట్లాడారు.. ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్

by Ramesh N |
MP Chamala: బన్నీపై పవన్ కళ్యాణ్ వాస్తవం మాట్లాడారు.. ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పందించారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో హాట్ కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు‌అర్జున్ (AlluArjun) అరెస్ట్ విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారని విమర్శించారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడారని, మానవత్వం కోణంలో మాట్లాడాడరని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడలేదని అన్నారు. మాకు అనుకూలంగా పవన్ మాట్లాడాడు అని నేను అనుకోవట్లేదు.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదు అని పవన్ మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. అల్లు అర్జున్ అరెస్టుతో సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని, ఇంకా రెండు నెలలు పుష్ప సినిమా నడుస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ నేత అంబటి రాంబాబు మంచి కళాకారుడని, నెక్ట్స్ సినిమాలో అంబటి రాంబాబుకి మంచి రోల్ ఇస్తారు నటించడానికి, అంబటి డాన్స్ కూడా బాగానే చేస్తాడన్నారు. మరోవైపు అంబటి రాంబాబుకి అంత సీన్ లేదన్నారు.

ప్రతిపక్షాలు అడుగుతున్న గురుకుల హాస్టల్ విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సీఎం ఎందుకు పరామర్శించలేదు అంటున్నారు.. అన్ని చోట్లకు వెళ్లడం సీఎంకి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు కావాలనే సీఎం రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed