BREAKING: ‘సెక్యులరిజానికి నేను వ్యతిరేకం’.. MP అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-03-03 15:10:15.0  )
BREAKING: ‘సెక్యులరిజానికి నేను వ్యతిరేకం’.. MP అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్యులరిజంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆదివారం అర్వింద్ ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదానికి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకమని కీలక ప్రకటన చేశారు. మతప్రాదికన దేశాన్ని విడదీసినప్పుడు సెక్యులరిజం ఎందుకని ప్రశ్నించారు. భారత్ సెక్యులర్ కంట్రీగా ఉండాలనుకున్నప్పుడు దేశాన్ని ఎందుకు మూడు ముక్కలు చేశారని నిలదీశారు. భారత్ దేశానికి ఎన్ఆర్సీ కచ్చితంగా అవసరమని అర్వింద్ తేల్చి చెప్పారు. ఎన్ఆర్సీ, యానిఫామ్ సివిల్ కోడ్ అమలుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య రామమందిర నిర్మాణంతో పాటు హిందూ నేషనలిజం వంటివి మాకు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఈ సారి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీకి ఓట్లు, సీట్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. తెలంగాణలో ఎనిమిది, పది సీట్ల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టి పారేశారు.

Advertisement

Next Story

Most Viewed