MLC Nominations: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

by Shiva |
MLC Nominations: ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌ (Graduate), టీచర్‌ (Teacher) ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీకీ మొత్తం ఇప్పటి వరకు 85 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు అఫీషియల్‌గా ప్రకటించారు. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్‌టీయూ (PRTU) బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి (Sripal Reddy), బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి (Sarottham Reddy) రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌ రెడ్డి (Harshavardhan Reddy), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ (Pula Ravinder) నామినేషన్‌ను వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ దూరం ఉంది. పార్టీ తరఫున తాము ఎవరినీ బరిలోకి దించలేదని ఇప్పటికే ప్రకటించింది.

కాగా, ఉభయ గోదావరి జిల్లాల (Godavari Districts) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికలకు ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఇవాళ గుంటూరు కలెక్టరేట్‌ (Guntur Collectorate)లో పీడీఎఫ్ (PDF) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణ రావు (Laxman Rao) నామినేషన్ వేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 3,15,267 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. అధికారులు 440 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వీకరించిన నామినేషన్లను ఎన్నికల అధికారులు మంగళవారం పరిశీలిస్తారు. ఈనెల 13 వరకు నామినేషన్లకు ఉప సంహరణకు అవకాశం కల్పించారు. 27న పోలింగ్ నిర్వహించి.. మార్చి 3న కౌంటింగ్ చేస్తారు.

Next Story

Most Viewed