- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరకపోతే ఐటీ, ఈడీ కేసులు: MLC Kavitha షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సిట్ విచారణకు రమ్మంటే బీఎల్ సంతోష్ కోర్టుకు వెళ్లారని.. తప్పు చేయనప్పుడు విచారణకు రావడానికి భయమేంటని ప్రశ్నించారు. మన మంత్రులు ఐటీ, ఈడీ విచారణకు పిలిస్తే వెళ్తున్నారని.. అలాంటప్పుడు మన దగ్గర దొరికితే మాత్రం విచారణ చేయొద్దా అని నిలదీశారు. బీఎల్ సంతోష్‌ను విచారణకు పిలిస్తే.. దానికి బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడని ప్రశ్నించారు. తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులకు ఎవరూ భయపడేవాళ్లు లేరని.. విచారణ చేసుకోండి.. అన్ని పత్రాలు చూపిస్తామని స్పష్టం చేశారు. రాజకీయంగా గట్టిగా ఉన్నవాళ్లను గద్దల్లా ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. గత నెల రోజుల నుండి తెలంగాణ మంత్రులను, ఎమ్మెల్యేలను వదలకుండా రైడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీలో చేరకపోతే ఐటీ, ఈడీ కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీకి అసలు నాయకుడే లేడు.. ఒక ఐడియాలజీ లేదని విమర్శించారు.