- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC Kavitha: ఉచిత సంక్షేమ పథకాలపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : MLC Kavitha Says Free education, healthcare not freebies| దేశంలో ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ఉచితాలు అనొద్దని ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ జనాభాలో ఎక్కువ మంది పేదవాళ్లే ఉన్నారని, వారి సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్రం, బీజేపీ అవమానిస్తోందని, వాటిని ఉచితాలుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. బ్యాంకులను లూటీ చేసిన కార్పొరేట్ వ్యక్తుల కోసం కేంద్రం ప్రకటించిన రూ.10 లక్షల కోట్ల మాఫీని ఉచితాలు అంటారని చెప్పారు. పేదల ఆరోగ్యం, వ్యవసాయం, పిల్లల చదువుల కోసం అమలు చేసేవి సంక్షేమ పథకాలని, ఇవేవీ ఉచితాలు కాదని తెలిపారు.
దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ పేదలను అవమానించొద్దని సూచించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయొద్దని భావిస్తే... వారికి సరైన ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ఉపాధి కల్పించలేనప్పుడు కచ్చితంగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిందేని చెప్పారు. ఉచిత పథకాలంటూ పేదలను అవమానించడం ఆపేయాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
ఇది కూడా చదవండి: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు