MLC Kavitha: తీహార్ జైలులో కవితతో ఆరెస్పీ, బాల్క సుమన్ ములాఖాత్.. ఆ విషయాలపై వారితో ఆసక్తికర చర్చ! (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-17 21:19:37.0  )
MLC Kavitha: తీహార్ జైలులో కవితతో ఆరెస్పీ, బాల్క సుమన్ ములాఖాత్.. ఆ విషయాలపై వారితో ఆసక్తికర చర్చ! (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఉదయం ములాఖత్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను జైలులోనే కలిశారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చిన విషయంపై వారి మధ్య చర్చకు వచ్చిననట్లుగా తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. తాజాగా గురువారం ఆమె బెయిల్ పిటిషన్ విచారణను చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మే 24కు వాయిదా వేసింది. దీంతో కవిత సీబీఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed