గవర్నర్ స్పీచ్‌: కొన్ని పదాలపై MLC కవిత తీవ్ర అభ్యంతరం

by GSrikanth |
గవర్నర్ స్పీచ్‌: కొన్ని పదాలపై MLC కవిత తీవ్ర అభ్యంతరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉదయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 15న ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరుతూ శనివారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. ‘విముక్తి’, ‘అణచివేత’, ‘నియంతృత్వ పాలన’, ‘వ్యవస్థల విధ్వంసం’, ‘వివక్ష‘ వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని కోరారు.

Advertisement

Next Story