MLC ఎన్నికల కౌంటింగ్ షురూ

by Sathputhe Rajesh |
MLC ఎన్నికల కౌంటింగ్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలో 4 స్థానిక, 3 పట్టభ్రదుల, 2 టీచర్, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు భిన్నంగా రౌండ్స్ తో నిమిత్తం లేకుండా ఈ లెక్కింపు ప్రక్రియ జరగనుంది. రెండు రోజుల పాటు నిరంతరాయంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed