- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Vemula : ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ధ కృష్ణమ్మకు ఎమ్మెల్యే వేముల పూజలు
దిశ, వెబ్ డెస్క్ : నకిరేకల్(Nakirekal) నియోజకవర్గ రైతుల సాగునీటికి ఆధారమైన నార్కెట్‌పల్లి మండలంలోని బ్రహ్మాణవెల్లంల ఉదయసముద్రం(Udayasamudram project)ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత రెండు రోజుల నుండి పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ధ కృష్ణమ్మకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మె్ల్యే వేముల వీరేశం(MLA Vemula) రైతులు, పార్టీ కార్యకర్తలతో కలసి కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు ద్వారా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని, ఈ ప్రాజెక్టు సాధనకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మా నకిరేకల్ నియోజకవర్గ రైతాంగం తరుపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టును నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తి చేసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య, రైతులు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.